మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 19:03:45

న‌మ‌స్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజ‌యకు అరుదైన గౌర‌వం

న‌మ‌స్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజ‌యకు అరుదైన గౌర‌వం

హైద‌రాబాద్‌: న‌మ‌స్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజ‌య‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. క‌రోనా మ‌హ‌మ్మారి 2021లో ఎలా ఉండ‌బోతుంది..? మ‌న దైనందిన జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది..? అనే అంశంపై జ‌ర్మ‌నీకి చెందిన ప్ర‌తిష్ఠాత్మ‌క వార్తాప‌త్రిక Suddeutsche Zeitung ప్ర‌పంచంలోని అంద‌రు కార్టూనిస్టుల నుంచి కార్టూన్ల రూపంలో అభిప్రాయాల‌ను ఆహ్వానించింది. దాంతో వంద‌ల మంది కార్టూనిస్టులు ఆ ప‌త్రిక‌కు కార్టూన్ల‌ను పంపించారు. వాటిన‌న్నింటిని ప‌రిశీలించిన Suddeutsche Zeitung ప‌త్రిక.. 18 దేశాల నుంచి 22 మంది కార్టూనిస్టులు పంపిన 27 కార్టూన్ల‌ను తన‌ ఆన్‌లైన్‌, ప్రింట్ ఎడిష‌న్‌ల‌లో ప్ర‌చురించింది. అలా ప్ర‌చురిత‌మైన 27 కార్టూన్‌ల‌లో 'న‌మ‌స్తే తెలంగాణ' కార్టూనిస్టు మృత్యుంజ‌య పంపిన కార్టూన్ కూడా ఒక‌టి కావ‌డం విశేషం. కాగా, ప్ర‌చురించిన ప్ర‌తి కార్టూన్‌కు Suddeutsche Zeitung ప‌త్రిక 150 యూరోల చొప్పున‌ పారితోషికం ప్ర‌క‌టించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo