తెలంగాణలో అరుదైన జీవజాతి

- 240 మిలియన్ ఏండ్లనాటి సరీసృపంగా గుర్తింపు
- కొల్‌కతాలోని ఐఎస్ఐ పరిశోధకుల వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రాణహిత-గోదావరి బేసిన్ చరిత్ర పూర్వయుగం నుంచి అరుదైన జంతుజాలానికి ఆవాసం. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక శిలాజాలు వెలుగుచూశాయి. కోటసారస్ యెమెన్పల్లెన్సిస్, రింకోసారస్ జాతికి చెందిన డైనోసర్, స్టెగోడాన్ వంటి వేలఏండ్ల క్రితం అంతరించిన ఏనుగుజాతికి చెందిన శిలాజాలు వెలుగుచూశాయి. తాజాగా అదే ప్రాంతంలో లక్షల ఏండ్ల క్రితం నివసించిన అరుదైన సరీసృపజాతిని కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ) పరిశోధకులు గుర్తించారు. 20వ శతాబ్దం మధ్యలో గుర్తించిన అనేక శిలాజాలను ఐఎస్ఐలో భద్రపరిచారు. వాటిలోయెరపల్లి రాతి నమూనా శిలాజాలపై అక్కడి పేలియాంటాలజిస్టులు, అంతర్జాతీయ పరిశోధన బృందంతో కలిసి సుదీర్ఘకాలంగా పరిశోధన చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆ శిలాజం 240 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించి అంతరించిపోయిన మాంసాహార సరీసృప జాతి ఎరిథ్రోసుచిడేకు చెందినదిగా నిర్ధారించారు.
భారీతలాసుచస్ తపానిగా నామకరణం
శాస్త్రవేత్తలు ఆ శిలాజానికి ‘భారీతలాసుచస్ తపన్గా’ నామకరణం చేశారు. అందులో భారీ అంటే పెద్దదైన, తల అంటే పుర్రె, సుచస్ అనేది మొసలి తల కలిగిన ఈజిప్టు దేవత పేరు. ఇక తపాని అనేది భారతీయ పాలింయాంటాలజిస్ట్ తపానీరాయ్ చౌదరి పేరు. భారతీయ సకశేరుక పాలియెంటాలజీకి, ముఖ్యంగా యెరపల్లి టెట్రాపోడ్ జంతుజాలంపై విశేష పరిశోధనలు చేసిన తపాని రాయ్‌చౌదరి గౌరవార్థం దానికి ఆ పేరు పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VB G Ram G Scheme | సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి.. ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్తో 3.73 లక్షల మంది కూలీలు మాయం
Government Lands | సర్కార్‌కు భూములే దిక్కా.. ఆస్తులు అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయమా?
చివరి చూపునకు వెళ్లినా నిర్బంధమేనా? బీఆర్ఎస్ నేత మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
Volunteer Jobs | నిరుద్యోగులకు మరో ధోకా.. లక్ష మంది వలంటీర్ల నియామకానికి రేవంత్ సర్కార్ ప్లాన్!
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

