సిరిసిల్ల రూరల్ ;రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సిరిసిల్లలోని గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థిని గుగులోతు మమతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆమె తీసిన ఫొటో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియకు ఎంపికైంది. ఈ మేరకు ఆర్సీడీఈఎస్ వెంకన్న, ప్రిన్సిపాల్ రజని, వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు, ఫొటోగ్రఫీ అధ్యాపకులు రఘు థామస్, భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.