అనంతగిరి అడవిలో అరుదైన మొక్క

‘బ్రాకెస్టెల్మా అనంతగిరియెన్సె’గా నామరణం
వికారాబాద్, జూలై 18: వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో అరుదైన మొక్కను ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం నిపుణులు గుర్తించారు. అపోసైనేసి కుటుంబానికి చెందిన బ్రాకెస్టెల్మా జాతికి చెందిన ఈ మొక్కను మూడేళ్ల క్రితం అనంతగిరి అడవుల్లో వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి, రీసెర్చ్ స్కాలర్ పరమేశ్ గుర్తించారు. జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ లెక్చరర్ డాక్టర్ బీ సదాశివయ్య, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి పరిశోధనకులు డాక్టర్ ప్రసాద్‌లు పరిశోధనలు జరిపి దీనికి బ్రాకెస్టెల్మా అనంతగిరియెన్సె అని నామకరణం చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు గుర్తించిన మొక్కల్లో ఏది ఈ జాతికి మొక్కను పోలి లేనందున కొత్త మొక్కగా భావిస్తున్నారు. భూమిలో బంగాళదుంప ఆకారం కలిగిన ఈ మొక్క.. తొలకరి చినుకులకే మొలకెత్తి ఆకులు లేకుండా పుష్పిస్తుంది. ఈ దుంపలను సుఖవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారని పరిశోధనలో తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

