లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య

రామవరం, ఏప్రిల్ 7: లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వర్మా అజయ్‌కుమార్(28) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పిన్ని కూతురిపై లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్‌కుమార్ మనస్తాపంతో భద్రాది జిల్లా రామవరంలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. తనపై తోడబుట్టిన సోదరుడు సుశీల్‌కుమార్, పెద్దమ్మ కుమారుడు వర్మా అజయ్‌కుమార్ కొంతకాలంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఓ యువతి 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సుశీల్, అజయ్‌తోపాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఆ యువతి అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేయ డం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు అజయ్‌కుమార్ తండ్రి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజయ్ గతంలో బెంగుళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడని, లాక్డౌన్ సమయం నుంచి ఖాళీగా ఇంటివద్దనే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
అంతర్జాతీయ జర్నల్‌లో మన పోలీస్ ఆర్టికల్
మా సర్వీసును క్రమబద్ధీకరించండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

