టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌పై రామోజీ రావు ప్రశంసలు
Ramoji Rao | రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్‌పై రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రశంసల వర్షం కురిపించారు. వినాయక చవితిని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్‌పై రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రశంసల వర్షం కురిపించారు. వినాయక చవితిని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంతోష్ కుమార్.. ఈ ఏడాది సీడ్ గణేశా విగ్రహాలను పంపిణీ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో పాటు పలువురు ప్రముఖులకు ఈ సీడ్ గణేశా ప్రతిమలను పంపించారు. విత్తన గణపయ్య ప్రతిమలు అద్భుతమంటూ ఎంపీ సంతోష్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌ను రామోజీరావు ప్రశంసిస్తూ, ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు రామోజీరావు ఓ లేఖ విడుదల చేశారు.
లేఖ సారాంశం..
మీరందించిన హృద్యమైన మట్టి గణపయ్య విగ్రహం మీకున్న పర్యావరణ చైతన్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. గతంలో కూడా ప్రాచీన భారతీయ సాహిత్యంలో ప్రస్తుతించిన అరుదైన వృక్షజాతుల చిత్రాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని వెలువరించి వృక్షాలపై, పర్యావరణంపై మీకున్న మక్కువను చాటుకున్నారు. సాంప్రదాయికమైన మన పండుగల్నీ పర్యావరణానుకూల రీతుల్లో జరుపుకోవచ్చన్న సందేశం స్ఫురించేలా మట్టి గణపయ్య విగ్రహాన్ని నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పండగ వేళ మీ ఇంటిల్లిపాదికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్య ఆనందాలు సదా మీ వెంట నిలవాలని కాంక్షిస్తూ..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
Ramayana | ‘రామాయణ’ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్.. నేడు కేవలం రూ.99కే సినిమా టికెట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

