వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 6: వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ డాక్టర్ రమేశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్‌లోని యూనివర్సిటీ పరిపాలనా భవనం లో మీడియాతో మాట్లాడారు. వారం రోజు ల్లో నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు అనుసరించి 2025-26 విద్యాసంవత్సరం పీజీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు.
ఇటీవల యూనివర్సిటీ అధికారులపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రానున్న విద్యాసంవత్సరం యూనివర్సిటీ పరిధిలో ప్ర భుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల ల్లో 420 పీజీ సీట్లు పెరుగనున్న ట్టు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల బాధ్యులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించి ర్యాగింగ్, డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షిస్తామని పేర్కొన్నారు.