హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 1: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని సర్వే ఆఫ్ ఇండియా(ఎస్వోఐ) గెజిటెడ్ అధికారుల సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా గోటూరి రమేశ్‌గౌడ్ ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. పొరుగు దేశాల మధ్య ఉండే అంతర్జాతీయ సరిహద్దుల నిర్వహణ, ఏదైనా వివాదం ఉత్పన్నమైనప్పుడు పరిష్కరించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. రమేశ్‌గౌడ్ ప్రస్తుతం బీఎంఎస్ ఉపాధ్యక్షుడిగా, స్వావలంభి భారత్ అభియాన్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.