హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్ రామ్‌చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితోపాటు ఆయనకు షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఎండీ(ఎఫ్ఏసీ)గా కూడా బాధ్యతలప్పగించింది. ప్రస్తుతం ఎఫ్ఏసీ డైరెక్టర్ బాధ్యతల్లో ఉన్న రామ్‌చందర్‌ను ప్రభుత్వం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించింది. తనను డైరెక్టర్‌గా నియమించడం పట్ల సీఎం కేసీఆర్‌కు, మంత్రి తలసానికి రామ్‌చందర్ కృతజ్ఞతలు తెలిపారు.