పేదలకు రంజాన్ తోఫాలు

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంతోపాటు వక్ఫ్‌బోర్డు కూడా తమవంతుగా పేద ముస్లింలకు సహాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీచేస్తున్నట్టు బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. రూ.21 లక్షల వక్ఫ్‌బోర్డు నిధులతో 2,500 ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. రంజాన్ గిఫ్ట్ప్యాక్లవాహనాలను శనివారం వక్ఫ్‌బోర్డు కార్యాలయం వద్ద హోంమంత్రి మహమూద్‌అలీ, బోర్డు చైర్మన్ సలీం సంయుక్తంగా జెండాఊపి ప్రారంభించారు. కరోనా బారిన పడుతున్న పేదలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకన్నా ఎంతో ముందున్నదని కొనియాడారు. కొవిడ్‌తో మరణిస్తున్న ముస్లింల అంత్యక్రియల నిర్వహణకు ముస్లిం గ్రేవ్యార్డ్ల నిర్వాహక కమిటీలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, జాఫర్ హుస్సేన్ మెరాజ్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ramadan
- ramadan mubarak
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

