Rajyasabha | రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు గురువారం సాయంత్రం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పార్టీ ఎంపిక చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలు కావడంతో వీరి ఎన్నిక లాంఛనప్రాయమే. వీరు కాకుండా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ నిబంధనల ప్రకారం ప్రతిపాదిత ఎమ్మెల్యేలు లేకపోవడంతో అవీ చెల్లుబాటు కావు. దీంతో శుక్రవారం నామినేషన్ల అనంతరం వాటిని తిరస్కరించనున్నారు.
కాగా ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లే ఉండటంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థుల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులే బరిలో ఉండటంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
కాంగ్రెస్ నుంచి రేణుకా, అనిల్‌కుమార్