సచివాలయ పనులకు రాజస్థాన్ మేస్త్రీలు
నూత న సచివాలయంలో రెడ్‌స్టోన్ కట్టడం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు రాజస్థాన్ నుంచి మరో 50 మంది మేస్త్రీలను రప్పించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. పనులన్నింటినీ సమాంతరంగా, నిర్ణీత గడువులోగా పూర్తిచేయడానికి మరో వేయి మంది నిపుణులైన కార్మికులను సమకూర్చుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు
మరో 1,000 మంది కార్మికులను పనిలో పెట్టాలి
వర్క్ ఏజెన్సీకి మంత్రి వేముల ఆదేశం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): నూత న సచివాలయంలో రెడ్‌స్టోన్ కట్టడం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు రాజస్థాన్ నుంచి మరో 50 మంది మేస్త్రీలను రప్పించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. పనులన్నింటినీ సమాంతరంగా, నిర్ణీత గడువులోగా పూర్తిచేయడానికి మరో వేయి మంది నిపుణులైన కార్మికులను సమకూర్చుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జీఆర్సీ క్లాడింగ్ వర్క్ నిపుణులను వెంటనే రప్పించి రౌండ్ పిల్లర్ల నగిషీల పనులను పూర్తి చేయాలని చెప్పారు.
గ్రానైట్, ఫ్లోరింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. యూపీవీసీ విండో, ఫాల్ సీలింగ్, విద్యు త్తు, ప్లంబింగ్ పనులతో పాటు మిగిలి ఉన్న సివిల్ పనులను సమాంతరంగా చేపట్టాలని, వీటిని ఆర్ అండ్ బీ ఇంజనీర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్‌కు సంబంధించిన రెయిలింగ్ పనులను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మొత్తం 32 డోమ్‌లకు గాను 16 డోమ్‌ల నిర్మాణం పూర్తయిందని, మరో 8 డోమ్‌ల స్ట్రక్చరల్ పనులు పూర్తయ్యాయని వివరించారు. సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణంలోని ప్రార్థనా మందిరాల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. గుడి, మసీదు, చర్చి, సెక్యూరిటీ బ్లాక్, ఆన్సిలరీ బిల్డింగ్ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

