హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజమౌళిచారిని నియమిస్తూ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ అశ్వనీకుమార్శర్మ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన మహాసభలో రాజమౌళిచారికి నియామక పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమం జాతీయస్థాయి మహాసభ నాయకులు సుభాష్‌చంద్రబోస్, ముఖ్య సలహాదారు చిన్మయాచారి, మహాసభ జాతీయ పరిశీలకులు రామ్రాజ్ విశ్వకర్మ, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.