హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) తర్వాతనే మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion) ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అన్నారు. నాకు హోమంత్రి కావాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు.
అధిష్ఠానం కూడా నాకు గతంలో హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేను హోం మంత్రి అయితేనే వాళ్లునియంత్రణలో ఉంటుంటారని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు.