Rains | హైదరాబాద్ : తెలంగాణలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరో వైపు రాష్ట్రంలో మూడు రోజులగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్లగొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదు అవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.