హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): దక్షిణ బంగాళాఖాతంలో గతనెల 27న ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కొమొరిన్ పరిసర ప్రాం తాల్లో స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో జనగామ, హ నుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, సూ ర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, నారాయణపేట, మేడ్చల్– మల్కాజిగిరి, మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల జి ల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసిందని వెల్లడించింది.