తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
భారీ వర్షాలు | ఈ క్రమంలో ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

హైదరాబాద్ : తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ద్రోణి కూడా బలహీనపడింది. నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో పలు కుంటలు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

