Rains : తెలంగాణ రాష్ట్రం (Telangana state) లో రాగల ఐదురోజులపాటు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూమి ఉపరితలం వేడెక్కడంతోపాటు ద్రోణి ప్రభావంవల్ల తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
అదేవిధంగా బుధవారం నుంచి రెండు రోజులపాటు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ర్టంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.