హైదరాబాద్ : నగరంలోని పలుచోట్ల భారీ వాన కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, టోలిచౌక్, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లి, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్‌లో భారీ వర్షం కురుస్తున్నది. సికింద్రాబాద్, బోయినపల్లి, బేగంపేట్, కొండాపూర్, కొత్తగూడ, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డికాపుల్, ఎర్రగడ్డ, సనత్‌నగర్ అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, బాచుపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమై చర్యలు చేపడుతున్నది. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.