Life Certificate | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రైల్వేలలో పెన్షన్‌దారులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడంపై ఆ శాఖ దృష్టి పెట్టింది. ఎస్సీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పెన్షన్‌దారులు తమ పెన్షన్‌ను కొనసాగించడానికి ప్రతి ఏడాది నవంబర్‌లో లైఫ్ సర్టిఫికెట్లను రైల్వే పెన్షనర్ల సంక్షేమ శాఖ కు సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా తెచ్చిన డిజిటల్ విధానంలో అలా ఉండదు. ఆన్లైన్ లో ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఇక నుంచి ఆ సర్టిఫికెట్ల దాఖలు చేయడాన్ని సులభతరం చేస్తూ ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 3.0’ ప్రారంభించినట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల మరీ ముఖ్యంగా సీనియర్ పెన్షన్‌దారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.