DA | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రైల్వే ఉద్యోగుల సంఘం కన్నెర్ర చేసింది. పాత పెన్షన్ విధానం, డీఏ డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంపై గుర్రుగా ఉంది. కేంద్రం తీరుకు నిరసనగా 12న రైల్వే డిపోలు, రైల్వే స్టేషన్ల వద్ద ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తామని ఎస్సీఆర్ఎంయూ జనరల్ సెక్రటరీ శంకర్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కార్మికులు, ఉద్యోగులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.