హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదా? లేక తెలంగాణ సీఎంగా ఆయనను ఎవరూ గుర్తించడం లేదా?’ అని నెటిజన్లలో సందేహాలు తీవ్రమవుతున్నాయి. ఆయన పేరు మరచిపోతు న్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఓ సందర్భంలో స్వయంగా రేవంత్‌రెడ్డే తన పేరు మరచి ‘ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి’ అన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో దశ సీజన్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలోనూ సీఎం రేవంత్‌రెడ్డికి భంగపాటే ఎదురైంది.
ఈ కార్యక్రమంలో సినీనటుడు, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పేరు మరచిపోయి ‘హానరబుల్ చీఫ్ మినిస్టర్ చిరంజీవి గారు సర్’ అని సంభోదించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. గతంలో నటుడు, యాంక ర్ బాలాదిత్య హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించే సమయంలో ‘సీఎం కిరణ్‌కుమార్’ అని పలికారు. మరో కార్యక్రమంలో లేడీ యాంకర్ స్టే జీపై ముఖ్యమంత్రి పేరును చీఫ్ మినిస్టర్ శ్రీధర్‌బాబు’ అని పిలిచారు.
కేం ద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సిం గ్‌తో కలిసి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ వ్యాఖ్యాత తెలంగాణ సీఎం అని పలికి పేరు మర్చిపో యి చివరికి చెప్పకుండానే వదిలేశారు. పుష్ప సినిమా సక్సెస్ మీట్లో సినీనటుడు అల్లు అర్జున్ సీఎం పేరును గౌరీనాథ్ అని ఏదో చెప్పబోయి తడబడ్డారు. సోషల్ యాక్టివిస్టు బైరి నరేశ్ కూ డా ‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్’ అని పలుకగా పక్కన ఉన్నవారు ‘రేవంత్‌రెడ్డి’ అని ఉప్పందించారు. ఇక ఓ స మావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి’.. అని చెప్పి కాసేపు ఆగిపోయారు.. వెనుకాల నుంచి ఎవరో పేరు చెప్పడంతో రేవంత్‌రెడ్డిగారు అని చెప్పి సంభాళించుకున్నారు.