CP Tarun Joshi | కాంగ్రెస్ జనజాతర సభ.. భట్టి డ్రైవర్‌పై రాచకొండ సీపీ ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభావేదిక సమీపంలో హంగామా చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారు డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం కాన్వాయ్‌తోపాటు డిప్యూటీ సీఎం కాన్వాయ్ ముందుకు వస్తున్నది.
CP Tarun Joshi | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభావేదిక సమీపంలో హంగామా చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారు డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం కాన్వాయ్‌తోపాటు డిప్యూటీ సీఎం కాన్వాయ్ ముందుకు వస్తున్నది.
ఈ దశలో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌కు చెందిన ఓ కారు డ్రైవరును పోలీసులు ఆపారు. దాంతో డ్రైవర్ పాస్ చూపించగా, నిర్ధారించిన పార్కింగ్ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. తన కారును పార్కింగ్ వీవీఐపీ వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని డ్రైవర్ వాదించాడు. అక్కడే ఉన్న రాచకొండ సీపీ తరుణ్ జోషి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నావంటూ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసుకోగా, అక్కడున్న పోలీసులు అతడిపై చేయిచేసుకున్నారు. ఈ ఘటన వీడియోలు ‘డిప్యూటీ సీఎం డ్రైవర్‌పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

