HYD Metro | హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఎల్అండ్టీ..?
HYD Metro | హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలిగేందుకు ఎల్అండ్టీ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.
HYD Metro | హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలిగేందుకు ఎల్అండ్టీ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నష్టాలు పెరిగాయి. అయితే, ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయం ఏమీ లేదని.. 2026 వరకు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు ఎల్అండ్టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ ఓ మీడియా సంస్థతో తెలిపారు.
అయితే, 65 సంవత్సరాల వరకు విక్రయించేందుకు వీలు లేదన్న ఆయన ఎల్అండ్టీకి వస్తున్న నష్టాల నేపథ్యంలో మెట్రో విక్రయానికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సంస్థకు భారీ నష్టాల నేపథ్యంలోనే అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్ కారణంగా ఎక్కువగా పురుషులో మట్రోలో ప్రయాణిస్తున్నారన్న ఆయన.. మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గిందన్నారు. అదే సమయంలో ఊబర్ , ఓలా, రాపిడో తదితర సంస్థతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందన్నారు. లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా ఫలితం ఇవ్వడం లేదన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఫ్రీ బస్‌పై ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంత బస్సులో ప్రయాణిస్తున్నారని.. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో బస్సులో వెళ్లాల్సిన పురుషులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారన్నారు. మెట్రో ప్రయాణం ఆసక్తికరంగా లేదని.. బస్సులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెయింటేనెన్స్ చేయాల్సి వస్తుందని.. ఇలా ఫ్రీగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల మెయింటేనెన్స్ కు డబ్బులు ఎక్కడ నుండి తీసుకువస్తారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ హామీల కోసం పెట్టిన ఈ స్కీం తెలంగాణ రవాణా సంస్థని అప్పుల పాలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ దివాలా తీస్తుంది!
ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంత బస్సులో ప్రయాణిస్తున్నారు.. బస్సుల సంఖ్య పెంచక పోవటం వల్ల బస్సులో వెళ్ళవలిసిన పురుషులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.. దీని వల్ల మెట్రో ప్రయాణం ఆసక్తికరంగా లేదు
బస్సులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి… pic.twitter.com/se6AgEPd5i
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

