రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైంది?
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువుతో రైతులు, ప్రజలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
- నిరుద్యోగులను మోసగించిన రేవంత్‌రెడి ్డ: ఆర్ కృష్ణయ్య
రవీంద్రభారతి, నవంబర్ 14 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువుతో రైతులు, ప్రజలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. శనివారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతోపాటు ప్రభుత్వ ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సుమారు 35 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
బీఈడీ, డీఈడీ అర్హతలున్న సమారు 8 లక్షల మంది నిరుద్యోగులను మోసగించిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హతలేదని ధ్వజమెత్తారు. పేదల చదువులకు డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ నేతలు వెంకటేశ్, జంగయ్య, అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు, విద్యార్థి సంఘం నేత రామ్దేవ్మోదీ, రాజేందర్, యాదయ్య, భీమరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

