రవీంద్రభారతి, డిసెంబర్ 25: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 42శాతం బీసీ రి జర్వేషన్తోనే నిర్వ హిం చాలని ఎంపీ ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. త్వ రలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లపై చర్చించి, చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని వెల్లడించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ వందలసార్లు ప్రకటించిందని గుర్తుచేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఏండ్ల తరబడి ఉద్యమాలు చేశామని, అయినా కాంగ్రెస్‌కు బుద్ధిరావడం లేదని విమర్శించారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి చెప్పినా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు.