హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ): రిజర్వ్ బ్యాంకుకు ఆద్యుడైన అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జూలై 26న నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ పోస్టర్ను కృష్ణయ్య తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలేను హరితప్లాజాలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.