ముగ్గురు క్షేమం, ఒకరు మృతి
సదాశివపేట, అక్టోబర్ 9: సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో సదాశివపేట మండలం కంబాలపల్లికి చెందిన బాలమణి అనే గర్భిణీకి ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. శనివారం ఆమెకు నొప్పులు రావడంతో వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించింది. వీరిలో ముగ్గురు 650 గ్రాముల చొప్పున బరువు ఉండగా, ఒక మగ పిల్లాడు 450 గ్రాముల బరువుతో జన్మించాడు. బరువు తక్కువగా ఉండటంతో వైద్యులు వీరిని హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానకు రిఫర్ చేశారు. అందులో 450 గ్రాముల బరువున్న బాబు చనిపోయినట్టు డాక్టర్ తెలిపారు. మరో ముగ్గురు క్షేమంగా ఉన్నారు.