హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరి ట రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష చర్యలు సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరో పించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులను, అధికారులను ప్రయోగిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం ఇంత హడావుడిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తమ్మినేని పేర్కొన్నారు.