హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో రిక్రూట్అయిన ఉద్యోగులు, ఇంజినీర్లకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం(టీవీఈఏ) డిమాండ్ చేసింది.
1999-2004 మధ్యకాలంలో నియమితులైన వారిని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్చాలని కోరుతూ ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీ జెన్కో సీఎండీని కలిసి వినతిపత్రం సమర్పించింది.