హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఈవీఎంల హ్యాకింగ్‌ను నిరూపించాలంటూ ‘ఎక్స్’ సీఈవో ఎలాన్‌మస్క్‌కు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సవాల్ విసిరారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చని ఆయన చెప్పారని, గతంలోనూ ఇలా చెప్పినవాళ్లు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాబట్టి ఇప్పుడు ఎలాన్‌మస్క్‌ను ఎన్నికల సంఘం భారత్‌కు ఆహ్వానించి హ్యాకింగ్ నిరూపణకు అవకాశమివ్వాలని కోరారు.