హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి సంబంధించిన 10 ఎకరాల భూమిని జేఎన్ఏఎఫ్ఏ వర్సిటీకి అప్పగించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం భోజన విరామ సమయంలో నిరసనలు కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, కన్వీనర్ వడ్డాణం శ్రీనివాస్, సెక్రెటరీ జనరల్ మహేశ్‌గౌడ్, జేఏసీ నేతలు డా. యాకేశ్ దైద, కాంతం ప్రేమ్‌కుమార్, ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, ప్రొఫెసర్ ఆనంద్ పవర్, రజనీకాంత్, డాక్టర్ వెంకటరమణ, రాములు, డాక్టర్ ఏ నారాయణరావు, రుషేంద్ర మణి, ఎన్సీ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.