హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో ధర్నా జరిగింది. ‘కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై మద్దతు తెలిపారు. ఫొటో ముద్రణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.