కోర్టు కేసులకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్లు, పిటిషన్లను పకడ్బందీగా దాఖలు చేయాలని అధికారులకు ఈఎన్సీ (అడ్మిన్) అనిల్‌కుమార్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు.
హైకోర్టులో 3,343 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 1,127 కేసులకు సంబంధించి మాత్రమే ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు అయ్యాయని వెల్లడించారు. సగటున రోజుకు 2 నుంచి 3 కేసులు పడుతున్నాయని, సకాలంలో స్పందిస్తే.. చాలా కేసులను అడ్మిషన్ స్టేజీలోనే నిలువరించే అవకాశముందని ఆ సర్క్యులర్‌లో వివరించారు.