హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రోడ్లు, భవనాలశాఖలో 64మంది డిప్యూటీ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన అధికారులు శాఖ బలోపేతం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.
సిట్ ఎదుట ఎంపీ కొండా, రాధాకృష్ణ
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ శుక్రవారం సిట్ ఎదుట హాజరయ్యారు. వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ సిట్ సమాచారం అందించడంతో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను సిట్ అధికారులు గంటపాటు విచారించి, స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా విచారించి, ఆయన వాంగ్మూలమూ తీసుకున్నారు.