హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొండపోచమ్మ సాగర్‌పై రూ పొందించిన ప్రచార వీడియోను పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం లో విడుదలచేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పర్యాటక, ఆకర్షణీయమైన ప్రదేశాల ప్రత్యేకతలపై షార్ట్షిల్మ్లు చిత్రీకరిస్తున్నట్టు చెప్పా రు. రాష్ట్రంలోనే ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి వివరాలు దేశీయ పర్యాటకులకు చేరేలా వీడియోలు రూపొందించి సోషల్‌మీడియా, టూరిజం ప్రచార, సమాచార కేంద్రాల ద్వారా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ, మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ కే వెంకటయ్య పాల్గొన్నారు.