హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ప్ర మోషన్ల జాతర మొదలైంది. పోలీస్‌శాఖలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 42 మంది డీఎస్పీ (సివిల్)లకు అడిషనల్ ఎస్పీ (నాన్ క్యాడర్)లుగా ప్రమోషన్ రానున్నది. ఈ మేరకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) అర్హత కలిగిన డీఎస్పీల వివరాలను ప్రభుత్వానికి పంపింది. 2022-23 ప్యానెల్ ఇయర్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా వారి రోస్టర్ పాయింట్లు, సీనియార్టీ ప్రకారం మొత్తం 46 మంది డీఎస్పీల లిస్టును కమిటీ తయారు చేసింది. తుది జాబితాలో నలుగురు అధికారులు బ్యాక్‌గ్రౌండ్ సరిగా లేకపోవటం, విధి నిర్వహణలో రిమార్కులు అధికంగా ఉండటంతో వారి ప్రమోషన్ వాయిదా వేసింది. ప్రమోషన్ లిస్టులో ఉన్న వారంతా 1991 బ్యాచ్‌కు చెందిన వారని తెలిసింది. వీరు వరంగల్, హైదరాబాద్ రేంజ్‌లలో వివిధ ప్రాంతాల్లో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ప్రమోషన్ల లిస్టు వాస్తవం కాదని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. నివేదిక ఆధారంగానే పదోన్నతులకు సంబంధించిన జీవో అతి త్వరలోనే విడుదల కానున్నట్టు సమాచారం.