శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 07, 2020 , 01:26:51

పలువురు ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌

పలువురు ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌
  • అధికారులకు పదోన్నతులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పలువురు సీనియర్‌ ర్యాంకు ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2002 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు రాజేశ్‌కుమార్‌, ఎన్‌ శివశంకర్‌రెడ్డి, డాక్టర్‌ వీ రవీందర్‌లకు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీపీ)గా ప్రమోషన్‌ ఇచ్చారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులు కార్తికేయ, కే రమేశ్‌నాయుడు, వీ సత్యనారాయణ, బీ సుమతి, ఎం శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వరరావులకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఐజీ)గా పదోన్నతి కల్పించారు. అలాగే 1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారులు రాకేశ్‌మోహన్‌ దోబ్రియాల్‌, లోకేశ్‌ జైశ్వాల్‌, 1989 బ్యాచ్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్‌లకు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (పీసీసీఎఫ్‌)గా ప్రమోషన్‌ ఇచ్చారు.


logo