హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల వర్సిటీలో జరిగిన ఆడిట్లో వర్సిటీ నుంచి వాహన అద్దె చెల్లింపులపై ఆడిట్‌శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ 2016 నుంచి 2024 వరకు 90నెలలకుగానూ రూ.61 లక్ష లు వాహన అద్దె కింద తీసుకున్నారు. వర్సిటీ ఆడిటింగ్‌లో ఈ విషయం వెలుగులోకి రావడంతో తిరిగి అవి రాబట్టేందుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై వర్సిటీ వర్గాలను వివరణ కోరగా.. మరో రెండురోజుల్లో న్యాయనిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.