హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గీత వృత్తిదారు లు ఎదుర్కొంటున్న పెన్షన్, ఎక్స్గ్రేషి యా, లైసెన్స్లు, సొసైటీల సమస్యలను జూలైలోపు పరిషరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లో గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ.. గీతవృత్తిలో చెట్లపైనుంచి పడి మరణించినవారు, గా యపడి తీవ్రంగా నష్టపోయిన వృత్తిదారులకు చెల్లించాల్సిన ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. రూ.10 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సం ఘం ప్రధాన కార్యదర్శి డీజీ సాయిలుగౌడ్ మాట్లాడుతూ గీత వృత్తిదారులకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వన పెంపకానికి 100 ఎకరాలు కేటాయించాలన్నారు. సంక్షేమ నిధిని రూ.ఐదు కోట్లకు పెంచాలని సంఘం కోఆర్డినేషన్ కార్యద ర్శి బొమ్మగాని నాగభూషణం డిమాండ్ చేశారు.