నందికొండ : బౌద్ధవనంలోని కృష్ణానదీ తీర పరిసరాల్లో ఆదిమానవుడి అడుగుజాడలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, బుద్ధవనం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధవనంలో కృష్ణా నదీ తీరం వరకు ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను పత్రికా సంపాదకుల బృందంతో కలిసి సోమవారం పరిశీలిస్తుండగా.. రాతి యుగపు ఆనవాళ్లను వెలుగు చూశాయని తెలిపారు.
రాతి పనిముట్లను అరగదీసిన గుంటలు కనిపించాయని, అవి క్రీస్తుపూర్వం 4000 నుంచి 2000 సంవత్సర కాలానికి చెందినవని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వెలుగు ఎడిటర్ చంద్రమౌళి, పయొనీర్ ప్రతినిధి మెల్లి మైత్రియి, బౌద్ధ నిపుణులు సంతోష్ రావత్, బుద్ధవనం ఓఎస్డీ సుధాకర్ రెడ్డి, ఎస్సీ క్రాంతి బాబు, సహాయక సెల్ఫీ శ్యాంసుందర్ ఏఈ జగదీశ్ ఉన్నారు.