హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)కి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రతిష్ఠాత్మకమైన సెర్బ్ స్టార్ (SERB-సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్ ఫర్ రిసెర్చ్)-2022 అవార్డుకు ఎంపికయ్యా రు.
ఐఐసీటీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మద్ది శ్రీధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ చేగొండి రాంబాబుల అత్యుత్తమ పనితీరును కేంద్రం గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేసింది. జాతీయస్థాయిలో 18 మంది పరిశోధకులుండగా, ఇద్దరు ఐఐసీటీకి చెందినవారు. వీరికి పరిశోధన గ్రాంట్ ఏడాదికి రూ.10 లక్షలు, మూడేండ్లకు ఓవర్ హెడ్ చార్జీలను చెల్లించనున్నది.