హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్, టైమ్‌స్కేల్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇస్తామని రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ హామీ ఇచ్చినట్టు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎమ్ హుస్సేనీ తెలిపారు. గురువారం యూనివర్సిటీలో జరిపిన చర్చల సందర్భంగా ఈ మేరకు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులు హుస్సేనీని సన్మానించడంతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు