తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 23: తెలుగు వికీపీడియా గురించి కొత్తవారు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనాఉపకరణాలు తయారుచేసేందుకు ప్రణయ్‌రాజ్ వంగరికి ఆ సంస్థ నుంచి ప్రాజెక్టు గ్రాంట్ లభించింది. ఈ ప్రాజెక్టుకు సహ గ్రాంటీగా మరో తెలుగు వికీపీడియన్ పవన్ సంతోష్ వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్ సమర్పించిన ప్రాజెక్టు ప్రపోజల్‌కు వికీపీడియా ఫౌండేషన్ అనుమతిచ్చింది. ప్రణయ్ ఎనిమిదేండ్లుగా తెలుగు వికీపీడియాలో వ్యాసాలను రాయడమే కాకుండా దాని గురించి తెలుగువారందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్‌తోపాటు పలువురు తెలుగు వికీపీడియన్లు ప్రణయ్‌కు అభినందనలు తెలిపారు. పవన్ సంతోష్, వీవెన్, యర్రా రామారావు, కృష్ణచైతన్య వంటి వికీపీడియన్లు ఈ ప్రాజెక్టు కమిటీ సభ్యులుగా ఉండి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రణయ్ తెలిపారు.