 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కీలక సమావేశం నిర్వహించనున్నది. నవంబర్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పీపీఏ ఆఫీసులో పీపీఏ 17వ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పీపీఏ సీఈవో నేతృత్వంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులతోపాటు రెండు రా ష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు. పీపీఏ ఆఫీసును ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి తరలించడంతోపాటు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలతోపాటు 14 అంశాలపై చర్చిస్తారు.
పోలవరం-బనకచర్ల లింక్ కూడా సమావేశంలో తెలంగాణ అధికారులు లేవనెత్తే అవకాశాలున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం బనకచర్ల డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. అయితే, టెండర్లు పిలవకుండా ఏపీని నిలువరించాలని గత నెల 10న పీపీఏతోపాటు సీడబ్ల్యూసీకి తెలంగాణ ఈఎన్ జనరల్ రాశారు. దీనిపై స్పందన రాలేదు.
 
                            