గణపురం, ఏప్రిల్ 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్లో గురువారం విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్లు లీకేజీ కావడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తిని పునః ప్రారంభించేందుకు మరమ్మతులు చేస్తున్నట్టు కేటీపీపీ అధికారులు తెలిపారు.
ఆర్టిజన్ల ధర్నాకు, విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని జెన్కో ఏడీఈ సంతోష్ పేరొన్నారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లనున్నది.