OU PhD Award | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ విభాగంలో పోటేటి ఉమారాణి డాక్టరేట్ సాధించారు. డాక్టర్ పన్నీరు రమేశ్ పర్యవేక్షణలో ‘హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ తెలంగాణ – ఎ స్టడీ ఆన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆమెకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె వనపర్తి జిల్లా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన వారు. ఆమె పీహెచ్డీ సాధించడం పట్ల పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.