TG Govt | తెలంగాణలోని 12 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ (రెవెన్యూ), రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా కే చంద్రారెడ్డి బాధ్యతలు అప్పగించగా.. భద్రాచలం ఈవో ఎల్ రమాదేవి రహదారులు భవనాలశాఖకు బదిలీ చేసింది. హనుమకొండ డీఆర్వోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రాజాగౌడ్, నల్గొండ కలెక్టర్ పీఏగా డిప్యూటీ కలెక్టర్ ఎల్ సుధ, నారాయణపేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా సీహెచ్ కోమల్రెడ్డిగా నియమించింది. దేవాదాయశాఖకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కే దామోదర్‌రావు, రహదారులు, భవనాలశాఖకు డిప్యూటీ కలెక్టర్‌గా పీ హరికృష్ణ, కల్వకుర్తి ఆర్డీవోగా ఎంపీ జనార్దన్, యాదాద్రి భువనగిరి డీఆర్వోవోగా ఎం జయమ్మ, అశోక్ చక్రవర్తిని రవాణాశాఖ, రోడ్లు భవనలశాఖకు (హౌసింగ్), నారాయణపేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా రాజేందర్‌గౌడ్‌ను నియమించింది.