PM Modi | మోదీ పర్యటనను నిరసిస్తూ వరంగల్‌లో వెలసిన ఫ్లెక్సీలు
ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్‌లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ‘నేను వరంగల్-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వరంగల్: ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్‌లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ‘నేను వరంగల్-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Modi
మామునూరు ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) ఏమైంది మోదీ? అంటూ ఫ్లెక్సీలు వెలశాయి. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం (Tribal varsity) ఏది?, బయ్యారం (Bayyaram) ఉక్కు పరిశ్రమ ఏమైంది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ (ITIR) ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో పర్యటించే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Modi
ప్రధాని మోదీ పర్యటనను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా నేడు ములుగులో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్ హాజరుకానున్నారు.

Modi
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

