హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే ఇవ్వాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ పోర్టల్‌లో లేని లేఖలను అంగీకరించబోరని తెలిపింది. భక్తులు ఒరిజినల్ సిఫారసు లేఖలను టీటీడీ అధికారులకు అందజేయాలని తెలిపింది.